ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 219 మంది విద్యార్థులతో తొలి విమానం ఇప్పటికే ముంబయి చేరుకుంది. కాగా, రెండో విమానం రుమేనియా రాజధాని బుఖారెస్ట్ నుంచి 250 మంది విద్యార్థులతో బయల్దేరిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులను సరిహద్దుల వద్దకు తరలించి రుమేనియా మీదుగా భారత్ తరలిస్తున్నారు.