కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో రాబోయే ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మైనింగ్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎస్సి ప్రత్యేక అధికారి టీ వెంకటేష్ అన్నారు మంగళవారం మండలంలోని గన్నేరువరం,జంగపల్లి ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎస్ ఎస్ సి విద్యార్థులు ప్రగతిని ప్రత్యేక తరగతుల నిర్వహణను ఆయన పరిశీలించారు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ జీపీఏ సాధించాలని ప్రత్యేక సమయ సారిణి ఏర్పాటు చేసుకుని అందుకు కృషి చేయాలని పేర్కొన్నారు వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు సీసీ కెమెరా పర్యవేక్షణలో SSC పరీక్షలు జరుగుతున్నాయని విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు ఎం ఈ ఓ మధుసూధనాచారి మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్ పుస్తకాలు క్షుణ్ణంగా చదివి విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు విలువైన సమయాన్ని వృధా చేయవద్దని పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావద్దని ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి ఫలితాలను సాధించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి, ఈ అంజనేయులు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు