కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామంలో 100 రోజుల ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న శనివారం ఉచితంగా మాస్కులు అందజేశారు కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎవరైనా అత్యవసరమైతే బయటకు వెళ్లాలి తప్ప వెళ్లిన తప్పకుండా మాస్కు ధరించాలి అని అన్నారు బయట మాస్కులు లేకుండా తిరిగితే పోలీసు వారు వెయ్యి రూపాయలు ఫైన్ లు వేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.