రాంగోపాల్ వర్మ ప్రకటించిన ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ మూవీ టీజర్ విడుదలైంది. వర్మ ముందుగా ప్రకటించినట్టుగానే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాతోనే తొలి పరిచయం అవుతోన్న పూజా భలేకర్ అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాలో ఎంతో హాట్ అండ్ ఎనర్జిటిక్‌గా నటించినట్టు ఈ టీజర్ స్పష్టంచేస్తోంది. భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఇదేనని చెబుతున్న రాంగోపాల్ వర్మ.. తన కెరీర్‌లోనూ ఇదే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని స్పష్టంచేశాడు. ఈ సినిమాతో తనకు ఎంతో ఎమోషనల్ టచ్ ఉందని వర్మ చెబుతున్నట్టుగానే ఇది వర్మ మార్క్ సినిమా అని టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది. మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ బ్రూస్‌లీ అంటే తనకు ఎంతో అభిమానం పలు సందర్భాల్లో చెప్పిన రాంగోపాల్ వర్మ.. నేడు బుధవారం బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3.12 గంటలకు బ్రూస్ లీ పుట్టిన సమయానికే టీజర్‌ను విడుదల చేయడం విశేషం.
Here is the teaser of my most ambitious and my most emotionally connected film to date #EnterTheGirlDragon featuring the #BruceLeeGirl
@poojabhalekarofficial ..Its India’s first martial arts film and an Indo Chinese Co -Production https://t.co/JLKCMiajg1— Ram Gopal Varma (@RGVzoomin) November 27, 2019