కరీంనగర్ జిల్లా మహానటుడు, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు ఛాయా చిత్రాలతో రూపొందించిన 2021 క్యాలెండర్ ను ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లో ఆ శాఖ అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య బుధవారం తెలంగాణ చౌక్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 దశాబ్దాల తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్టీఆర్ తిరుగులేని కథానాయకుడిగా చెలామణి అయ్యారని, 309 పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి తెలుగువారి ఆధారాభిమానాలు చూరగొన్నారన్నారు. నటనలో ఆయనకు ఎవరు సాటి లేరని, ఇక ముందు రాబోరని ఆయన స్పష్టం చేశారు. నటుడిగా,ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తించి కేంద్రం ఇప్పటికైనా ఆ మహనీయుడికి భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆగయ్య డిమాండ్ చేశారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఇ ఓరుగంటి భార్గవ్ సంఘం నాయకులు సాన మురళి సందెబోయిన రాజేశం, చేవూరి నరసింహాచారి, నేదునూరి సంజీవ రావు,గూడ లక్ష్మణ్ ఓరుగంటి పెద్దిరాజు, గాజుల నాగరాజు, టిడిపి నాయకులు నాగుల బాలా గౌడ్, వంచ శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ శ్రీధర్ , రొడ్డ శ్రీనివాస్, ఎర్రవెల్లి రవీందర్, ఎస్.కె మహమ్మద్, ఎండి వాజిద్ ఖాన్ , బోలుమల్ల సదానందం, ఎండి మహబూబ్ ఖాన్,మేకల రాయమల్లు,జి.ఓదెలు తదితరులు పాల్గొన్నారు.