అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజక వర్గం గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డు నందు బీసీ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారు మరియు గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనురు జయరామ్ గారి సోదరుడు నారాయణ. ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన పెన్షన్ల పెంపుపై ఎంతో చిత్త శుద్ధితో చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి వృద్ధాప్యం 4000 రూపాయలు మరియు వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు పెంచుతామన్న దానికి కట్టుబడి జులై నెలలో గత మూడు నెలల 1000 రూపాయలు కలుపుకొని మొత్తం 7000 రూపాయలు ఇస్తూ ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తెలిపారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంపుకు ఐదు సంవత్సరాలు పట్టిందని మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అధికారం చేపట్టిన మొదటి నెలనే ₹1000 పెంచి 4000 రూపాయలు ఇస్తున్నారని వాళ్ళు లాగా ఐదు సంవత్సరాలు సమయం తీసుకోలేదని ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు ఎంకే చౌదరి రవితేజ నారాయణస్వామి పాటిల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు