ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ ఛార్జ్ షీట్లపై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్ షీట్ లో డిశ్చార్జ్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగాయి.మరోవైపు జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణను వేర్వేరుగా విచారణ జరపాలనే విషయంపై రేపు విచారణ జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇంకోవైపు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.మరోవైపు … సీబీఐ, ఈడీ కేసుల విచారణను వేర్వేరుగా జరపాలని జగన్ వేసిన పిటిషన్ పై ఈడీ నిన్న కౌంటరు దాఖలు చేసింది. రెండు కేసులను కలిపే విచారించాలని అఫిడవిట్లో ఈడీ పేర్కొంది.