గత వారం రోజుల క్రితం బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కరీంనగర్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి గత 6నెలలుగా బెజ్జంకి మండలంలోని ప్రజా సమస్యలపై సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తే స్థానిక శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ అతనికి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ నీ అంతు చూస్తా అని బెదిరించడంతో అతను ఐదు రోజుల క్రితం బెజ్జంకి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కు తెలియజేశారు అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడిన శాసనసభ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఈకార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మేడిపల్లి సత్యం, తాడూరి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు