● అత్యధిక మెజార్టీ వచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..
● కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
● శంకరపట్నంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సమావేశానికి హాజరు
కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ మండలంలో ఉన్న గ్రాడ్యుయేట్లను గ్రామాల వారీగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవడం ఖాయమని నాయకులు, కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని తెలిపారు. నాయకులు కార్యకర్తలు నిర్లక్ష్యంగా ఉండవద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ విజయానికి పాటుపడాలని సూచించారు. విద్యావంతుడు నరేందర్ రెడ్డి కరీంనగర్ లో అందుబాటులో ఉండే వ్యక్తి అని, ఆయనను గెలిపిస్తే ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.