ఉమ్మడి కరీంనగర్ జిల్లా: ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామికి తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ముడుపు కట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన జీవోను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు తుగ్లక్ నిర్ణయాలతో
కేసీఆర్ తీసుకువచ్చిన ఎల్ ఆర్ ఎస్ కు ఎవరూ భయపడకూడదని, ప్లాట్ల రెగ్యులేషన్స్ రుసుం చెల్లించ కూడదని, ఎల్ఆర్ఎస్ పై హైకోర్టులో పిల్ దాఖలైందని, తీర్పు ప్రజల పక్షాన ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్ ఆర్ ఎస్ జీవో కు వ్యతిరేకంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని జోజిరెడ్డి రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు దండుకోవాలనే లక్ష్యంతో ఆ భారం పేదలపై నెట్టడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు ఒకసారి స్థలం అమ్మకం, కొనుగోలు పైన రిజిస్ట్రేషన్ సమయంలో డబ్బులు చెల్లించిన తర్వాత అదే స్థలానికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తామనడం నేరమవుతుందన్నారు. ఆస్తుల పేరిట వివరాలు సేకరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎల్ ఆర్ ఎస్ కట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ చట్టంతో లాభం మాట దేవుడెరుగని, ఇప్పుడు కొలతల పేరిట ప్రజలపై అదనపు భారం పడుతుందని ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని జోజిరెడ్డి డిమాండ్ చేశారు.
వీరి వెంట టీడీపీ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి గుర్రం నర్సాగౌడ్, మల్యాల మండల పార్టీ నాయకుడు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు కరుణాచారి,బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,పర్లపల్లి రవీందర్,పార్టీ నాయకులు రాజేందర్, ముకుంద ఆంజనేయులు, రామయ్య,నారాయణ తదితరులు ఉన్నారు