తమిళనాడు అటవీ శాఖ మంత్రి దిండుగల్ సి.శ్రీనివాసన్ ప్రవర్తన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ముదుమలై నేషనల్ పార్క్ లో ఏనుగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓ శిబిరాన్ని ప్రారంభించడానికి వెళ్లిన మంత్రి అక్కడ ఉన్న ఓ మందిరాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట కలెక్టర్లు, ఉన్నతాధికారులు స్థానికులు ఉన్నారు. మందిరంలోకి వెళ్లే ముందు తన కాలికి ఉన్న చెప్పులను తీయాల్సి ఉండడంతో శ్రీనివాసన్.. వంగి చెప్పులను తీసుకోలేక అక్కడ ఉన్న గిరిజన బాలుడిని ‘ఏయ్ ఇటురా’ అంటూ పిలిచి, తన చెప్పులను తీయాలని చెప్పారు. దీంతో అందరి ముందూ ఆ బాలుడు మంత్రి గారి చెప్పులను తీయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. కలెక్టర్, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఘటన జరిగినప్పటికీ ఆ అధికారులు ఈ చర్యను అడ్డుకోలేదు. గిరిజన బాలుడితో చెప్పులు తీయించుకున్న తమిళనాడు మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
#WATCH Tamil Nadu minister Dindigul C Srinivasan makes a boy remove his sandals during the Minister's visit to Mudumalai National Park. pic.twitter.com/L4dZr8Q33y
— ANI (@ANI) February 6, 2020