భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్ద మిడిసిలేరు గ్రామం నుంచి తాలిపేరు ప్రాజెక్టుకు వెళ్ళే మార్గం లోని తగిడవాగు వంతెన సమీపంలో రహదారిని ఆదివారం రాత్రి ఐఈడి బాంబుతో పేల్చి ద్వంసం చేసిన మావోయిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 3 గురువారం జరిగిన శంకర్ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ ఘటనకు పాల్పడ్డారని భావిస్తున్న పోలీసులు. కాగా ఆదివారం మావోయిస్టులు ఉత్తర తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఘటనా స్థలంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, ఏటూరు నాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేర్లతో కరపత్రాలు వదిచిన మావోయిస్టులు.