ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగిన రోహిత్ వన్డే ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు. 2019లో మొత్తం 28 మ్యాచ్‌లాడిన రోహిత్ 57.30 సగటుతో 1409 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా వరుస విజయాలతో చెలరేగింది. ఇక మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ధాటిగా ఆడుతోంది. టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్(42; 44 బంతుల్లో 6×4) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ధాటిగా ఆడుతున్న తరుణంలో ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగాడు. ఇదిలా ఉండగా ముంబయి బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్ ద్వారా 137 ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వెళ్లి ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడి కన్నా ముందు హషీమ్ ఆమ్లా(147), సచిన్ తెందూల్కర్(160), తిలకరత్నే దిల్షాన్(165), సౌరభ్ గంగూలీ(168) ఇన్నింగ్సుల్లో ఏడు వేల పరుగులను పూర్తి చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
