అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద గుత్తి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో కూల్ ఫిల్టర్ వాటర్ చలివేంద్రమును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కావడంతో గ్రామాల నుండి పట్టణానికి వారి సొంత పనుల పైన విచ్చేస్తున్న ప్రజలకు, పాదాచారులకు ఎండ తీవ్రతకు అనారోగ్య బారిన పడకుండా దాహార్తిని తీర్చడం గుత్తి కమ్మవారి సేవా సంఘం సహృదయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీ గోపినేటి సురేంద్ర నాయుడు(సూరి) ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ మల్లికార్జున నాయుడు కోశాధికారి పి రమేష్ బాబు గౌరవ అధ్యక్షులు పి కేశన్న గౌరవ సలహాదారులు: పి కృష్ణారావు, N.కేశవ నాయుడు,రవితేజ నారాయణస్వామి,సర్పంచ్ పి భరత్, ఎంపీటీసీ ఎం ధనుంజయ, సి.లక్ష్మణ్, వై లక్ష్మీనారాయణ, బి లక్ష్మీకాంత్ ఎం రంగస్వామి తదితరులు పాల్గొన్నారు
