కరీంనగర్ పట్టణం లో 21 వ కార్గిల్ విజయ్ దివస్ వేడకలు ఘనంగ జరుపుకున్నారు . కరీంనగర్ హోసింగ్ బోర్డు కాలనిలో జయహో జనతా జవాన్ మరియు న్యూ వెలుగు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యం లో కార్గిల్ యుద్ధం లో అమరులైన సైనికులందరిని స్మరించుకుని , నాటి విజయానికి గుర్తుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పద్మప్రకాష్ , బండి రాజయ్య , నల్ల గణపతి రెడ్డి , కోట శ్రీనివాస్ , శంకర్ , నల్ల సుదర్శన్ రెడ్డి , సంజీవ్ , కిషన్ , చోటు , భాస్కర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు .