కారంపూడి మాచర్ల రోడ్డులోని డిస్కవరీ స్కూల్ వెనుక భాగంలో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ డొంక పురంబోకు భూమి సర్వే నెంబరు 393లో 1.95 సెంట్ల భూమి ఉంది. అందులో ఆరుగురు వ్యక్తులు సర్వే నెంబరు మార్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన కారంపూడిలో కలకలం రేపుతుంది. ఈ విషయంపై సోమవారం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో సమీప పొలం దారులు ముత్యాలంపాటి మల్లికార్జున, పద్మ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శివశంకర్ విచారించి నివేదిక ఇవ్వాలని తాహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను ఆదేశించారు. దీంతో ఫిర్యాదుదారులైన ముత్యాలంపాటి మల్లికార్జునరావు, పద్మా లను డొంగ పోరంబోకు స్థలం వద్దకు పిలిపించి విచారణ నిర్వహించారు. డొంగ పోరంబోకు భూమిలో ఎలాంటి ఆక్రమణలు లేవని తాహశీల్దార్ అన్నారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలని పొలం దారులకు తాహశీల్దార్ సూచించారు. దీంతోపాటు డొంక పోరంబోకు మార్గంలో అడ్డుగా ఉన్న ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు పై కలెక్టర్ కి తెలియజేయాలని వారితో చెప్పారు. అంటే అక్రమ రిజిస్ట్రేషన్ల పై బాధ్యతగలిగిన తహసీల్దార్ మాట్లాడాల్సిన మాటలివేనా, అక్రమ రిజిస్ట్రేషన్ల పై , అకృమార్కుల పై ఒక నివేదికను కలెక్టర్ కి పంపాల్సిన తహసీల్దార్ సదరు బాధితులకు హితబోధ చేస్తున్నారు. ముత్యాలంపాటి మల్లికార్జునరావు, పద్మ లకు అక్రమ రిజిస్ట్రేషన్ల పై కలెక్టర్ కి ఫిర్యాదు చేయమనడం హాస్యాస్పదంగా ఉంది. ఇకనైనా తహసీల్దార్ స్పందించి దర్యాప్తు చేసి కలెక్టర్ కి నివేదిక పంపాలి.
ముత్యాలంపాటి పద్మ తాహశీల్దార్ ను పలు ప్రశ్నలు అడిగారు.
డొంగ పోరంబోకు భూమి ఆక్రమించుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కనీసం ఆక్రమణదారులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లు రద్దుచేసి అందుకు కారకులైన వారితో పాటు సహకరించిన కార్యదర్శి కాశీ విశ్వనాథంపై చర్యలు తీసుకునే వరకు కలెక్టర్ ఆఫీసు చుట్టు తిరుగుతామని, ఆత్మహత్య కైనా వెనుకాడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ల ను తనకా పెట్టుకొని ఐదు లక్షల (రూ 5,00,000/)రుణం మంజూరు చేసిన శ్రీరామ్ సిటీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని సంస్థ రీజనల్ మేనేజర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.