ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వరస్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా, కాసేపట్లో కేసీఆర్ హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు.అనంతరం లక్ష్మీ బరాజ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సాగునీటిని అందించడంపై అధికారులకు సూచనలు చేస్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలపై వివరాలు తెలుసుకుంటారు.పంటలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించే అంశంపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేస్తారు. మధ్యాహ్నం లక్ష్మీ బరాజ్ వద్దే కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కాళేశ్వరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.