కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలలో తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రజలు నిత్యావసర వస్తువులైన (కిరాణా,కూరగాయలు మరియు పండ్లు) కొరకు ఉదయం 6 గంటల నుండి 6 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మరియు ఫోర్ వీలర్ పై ఇద్దరిని మాత్రమే నిత్యావసరాలకై అనుమతించడం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.