కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన నగునూరి పెద్ద మల్లయ్య కు చెందిన బర్రె మృతి చెందింది సుమారు దీని విలువ 60 వేల రూపాయలు ఉంటుందని మల్లయ్య తెలిపాడు రోజులాగే గురువారం రోజు ఉదయం బర్రెకు గడ్డి వేసే సమయంలో బర్రెకు ఎర్రి లేసి చనిపోయినట్లు తెలిపాడు బర్రె చిన్నతనంలో కుక్క కాటు వేసిందని ఆయన తెలిపాడు దీంతో మల్లయ్య కుటుంబం రోదనలు మిన్నంటాయి నగునూరి పెద్ద మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న కోరారు.