భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో సుమారు 70 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆక్సీజన్ ప్లాంట్ ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కోవిడ్-19 విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో, కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఈ ఆక్సీజన్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగ పడనుంది. ప్లాంట్ పనులు గత నెల 25 న ప్రారంభించగా నేడు ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఇదే ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించిన 13 వేల లీటర్ల ఆక్సీజెన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సీజెన్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే కరోనా రోగులకు అత్యవసర సమయంలో ఆక్సీజన్ అందిస్తుండగా, మంగళవారం ప్రారంభించిన ఆక్సీజెన్ ప్లాంట్ నిముషానికి 300 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండగా దీని ద్వారా సుమారు 200 మంది కరోనా రోగులకు ప్రాణ వాయువు అందుబాటులో ఉండనుంది. ప్రారంభోత్సవం అనంతరం కరోనా ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను కలిసి ధైర్యం చెప్పి ఆహార పదార్థాలను అందించిన మంత్రి వారికి కావాల్సిన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మేడికల్ కాలేజికి అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపిన మంత్రి, భద్రాచలం వైధ్యశాలలో అవసరమున్న వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్‌కు అదేశాలు ఇచ్చారు.
మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏజెన్సీకి తలమానికం అయిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నూతన ఆక్సీజెన్ ప్లాంట్ మరొక వరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు, జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అనుదీప్, ఐటిడిఎ పిఒ గౌతమ్ పొట్రూ, జెడ్పి చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని, సుపేరెంటెండ్ ముక్కంటి ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.