కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన తన భార్యతో కలిసి పర్యాటక శాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, కేబినెట్ మంత్రులుగా అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ కూడా బాధ్యలు స్వీకరించారు.
అనురాగ్ ఠాకూర్‌కు సమాచార, ప్రసారాల శాఖ, వైష్ణవ్‌కు రైల్వే శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు కూడా బాధ్యతలు స్వీకరించారు.
పలువురు సహాయ మంత్రులు కూడా ఈ రోజు ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా, పర్యాటక శాఖల సహాయ మంత్రిగా శ్రీపాద యసో నాయక్, పర్యాటక శాఖ సహాయమంత్రిగా అజయ్ భట్, సాంస్కృతిక శాఖ సహాయమంత్రిగా మీనాక్షి లేఖి, ఈశాన్య రాష్టాల అభివృద్ధి సహాయ మంత్రిగా బీఎల్ వర్, ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయమంత్రిగా రాజీవ్ చంద్ర శేఖర్ బాధ్యతలు స్వీకరించారు.