నాకు కొడుకుల్లేరు బంచన్.. నువే నాకు పెద్దకొడుకు అనుకుంటున్న.. ఉన్న ఒక్క బిడ్డకు 30 ఎండ్ల కింద నే పెళ్లి చేసి పంపిన
మాది ఉమ్మడి కరీంనగర్ జల్లాలో(ప్రస్తుత జిల్లా సిద్దిపేట) ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామం
నేను రడం మల్లయ్య (69 సంవత్సరాలు) తండ్రి పేరు రడం దుర్గయ్య
నా భార్య రడం ఎల్లవ్వ(64 సంవత్సరాలు)..
కొడుకా ఇన్ని రోజులు పాలేరు గ ఉన్న..మన గవర్న మెంట్ వచ్చాక నాకు పించిని 3000 వస్తున్నాయి..నేను పాలేరు పని బందు చేసి వచ్చిన పించిని తో బతుకుతున్నము బిడ్డ.. నా ముసల్ది కైకిలి కులీ చేస్తుంది ఇప్పటికీ..దానికి కొన్ని రోజుల కింద మేదట్లో రక్తం సరఫరా తగ్గింది అని డాక్టరు చెప్పిండు బిడ్డ.. అయిన చేతనైన పనికి పోతుంది..
కొన్ని ఎండ్ల నుండి నా పానం మంచిగా లేక మంచన పడ్డ బిడ్డ..
మా అవ్వ అయ్యాలు ఉన్నపుడు కట్టించిన ఇంట్లో ఉంటున్నాం బిడ్డ..ఈ జోరు వానలకు ఇల్లు కులీ మట్టి పెళ్ళలు పడ్తున్నాయి బిడ్డ..
వాన నీళ్ళు ఒక పక్క మేము ఒక పక్క బతుకుతున్నాం బంచన్
నువు ఇచ్చే పించన్ వల్ల మేము ఈ మాత్రం బతుకుతున్నాం బిడ్డ…మేము పోయె వరకు అయిన మాకు ఒక రేకుల షెడ్డు అయిన వెపియు బంచన్..నీ పేరు తల్సుకుంటం కొడుకా కేటీఆర్….