కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి – తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ ప్లాజా వద్ద నెల రోజుల నుంచి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ కు చుట్టుపక్కల గ్రామం నుంచి 40 టీమ్ ల దాకా హాజరయ్యాయి. ఈరోజు ఫైనల్ కు చేరుకున్న రెండు టీమ్ లు అడగ గెలుపొందిన ఇందిరానగర్ కు చెందిన సదానందం 11 టీమ్ కు మొదటి బహుమతి 25వేల రూపాయల నగదుతో పాటు కప్పు,గుండ్లపల్లి కి చెందిన రన్నర్ అజార్ 11 కు 12,500 రూపాయలు కప్పు అందజేశారు నిర్వాహకులు గుండ్లపల్లి సర్పంచ్ సమత రాజేందర్ రెడ్డి…ఈ సందర్భంగా బేతేల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మా నాన్న గారి జ్ఞాపకార్థం నిర్వహించిన టోర్నమెంట్ కు చాలా మంది యువకులు వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు… కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మైదానం వద్ద శానిటైజర్ మస్కులు అందుబాటులో ఉంచామని అన్నారు… నెల రోజుల పాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ కు సహకరించిన గుండ్లపల్లి ఆర్గనైజేషన్ టీమ్,యువకులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు….ఈ కార్యక్రమంలో… సర్పంచ్ బెతెల్లి సమత రాజేందర్ రెడ్డి, రేణికుంట సర్పంచ్ బోయిని కొమరయ్య, గొల్లపల్లి సర్పంచ్ మల్లెతుల అంజయ్య,ఉప సర్పంచ్ చింతల పద్మ పర్శరములు, వార్డు సభ్యులు, యువకులు ఆజార్,పుట్ట శీను, వంశి, ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.