కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం గ్రామపంచాయితి కార్యాలయ ఆవరణలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని శనివారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రైస్తవులకు నూతన బట్టలను పంపిణీ చేసి, అనంతరం 8 మంది లబ్దిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు .రంజాన్. బతుకమ్మ. క్రేస్తవులకు .బట్టలను పంపిణీ చేస్తువున్నదని దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మానకొండూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి గా గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రేస్తవులకు బట్టలు పంపిణీ చేయాలని సదుద్దేశంతో ఈరోజు పంపిణీ చేశామని అలాగే 8 మంది కల్యాణ లక్ష్మి కింద 8.లక్షల.928 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించామని అన్నారు ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచ్ పుల్లెల లక్ష్మి, ఎమ్మార్వో బండి రాజేశ్వరి. అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్ – ఎంపీటీసీలు. అధికారులు పాల్గొన్నారు