కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేజ్ శానిటేషన్ కమిటీ మరియు పర్యవేక్షణ నిఘా కమిటీ సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న అధ్యక్షతన సమావేశమై గ్రామంలో 100% పారిశుధ్యం మరియు ఇంకుడు గుంతల వాడకం ఐఎస్ఎల్ వాడకం తడి చెత్త – పొడి చెత్త కొరకు చెత్త బుట్టలో వాడకం జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కొరకు 8 వార్డులకు గాను ఎనిమిది మంది పరిశీలకులను నియమించి వారు సర్వే మరియు అవగాహన కల్పించుటకు నోట్ బుక్స్ మరియు పెన్నులు గ్రామ సర్పంచ్ అందజేసి గ్రామంలోని ఇళ్లలో పైన తెలిపిన ప్రకారం వాడుకునే విధంగా అవగాహన కల్పించవలసిందిగా కోరనైనది తదనంతరం గ్రామంలోని సెగ్రిగేషన్ షేడ్ వద్ద పనికిరాని ప్లాస్టిక్ ఇనుప వస్తువులు వేరు చేసే విధానం వివరించడం అయినది ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా అమలు పరచుటకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఆనంద్ యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ రవీందర్ వార్డు సభ్యులు బుర్ర ఎల్లయ్య, వైకుంఠం సతీష్, అంగన్వాడి కార్యకర్తలు శ్యామల, రాజేశ్వరి, ఆశ వర్కర్ C A బుర్ర సంపత్, వివో వివో లు బొజ్జ మమత, లావణ్య, కారోబార్ సందేవేని పరుశరాములు, సిబ్బంది రాజిరెడ్డి, రాజమల్లు, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.