contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గత ఏడాది నీళ్ళు లేక ఈ ఏడాది నీళ్లు ఎక్కువై మూత పడిన తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక భార జల కర్మాగారం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం:      .                                                               జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు, చుట్టుపక్కల నుండి జిల్లాకు చేరే వరదలు తోడవడంతో జిల్లా అంతా జిల్లా అంతా  జలమయం అయింధి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో అశ్వాపురం మండలంలోని భార జల కర్మాగారాన్ని మూసివేశారు. కుండపోతగా కురుస్తోన్న వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మూడు రోజుల క్రితం తగ్గిన గోదావరి మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా అశ్వాపురం సమీపంలోని భారజల కర్మాగారంలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్లాంట్‌ను మూసివేశారు. వర్షాలు, వరదల కారణంగా ఈ భారజల కర్మాగారం మూతపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు పాల్వంచలోని కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారాన్ని సైతం వర్షాల కారణంగా మూసివేశారు.

గత ఏడాది మే నెలలో గోదావరిలో నీళ్లు లేక పోవడంతో హెవీ వాటర్ ప్లాంట్‌ను మూసివేశారు. 28 ఏళ్ల ప్లాంట్ చరిత్రలో నీళ్లు లేక తొలిసారి గత ఏడాది మూతపడగా. ఈ ఏడాది భారీ వర్షాలతో ప్లాంట్ షట్ డౌన్ అయ్యింది. దేశ అణు అవసరాల కోసం రాజస్థాన్‌లోని కోటలో తొలి హెవీ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా.. తర్వాత మణుగూరు సమీపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా 185 మెట్రిక్ టన్నుల న్యూక్లియర్ గ్రేడ్ హెవీ వాటర్‌ను తయారు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం 69.8 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 20 మధ్య జిల్లాలో 501.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 1270 మి.మీల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే ఇది 153.3 శాతం అధికం కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం తగ్గినట్టే తగ్గిన గోదావరి మరోసారి ప్రమాదకరంగా మారుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోన్న గోదావ‌రి వ‌ర‌ద పోటుతో ఏజెన్సీ మండ‌లాలు చిగురాటుకులా వణికిపోతున్నాయి. చ‌ర్ల‌, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మ‌ణుగూరు మండ‌లాల్లోని లోత‌ట్టు గ్రామాలు, ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

అశ్వాపురం మండ‌లంలో గురువారం 105.6 మి.మీ. వర్షం కురవడంతో.. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. 

వాగులు పొంగ‌డంతో 16 గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. మండలంలోని ప్రధాన సాగునీటి వనరైన తుమ్మల చెరువు అలుగు పోస్తోంది. చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో జేసీబీ సాయంతో నీరు వెళ్లే మార్గాన్ని వెడల్పు చేశారు. ఓవైపు చెరువు అలుగు, మరోవైపు గోదావరి వరద కారణంగా మండంలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

15 రోజుల క్రితం వరకు వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసిన అశ్వాపురం మండల రైతులు ఇప్పుడు కుండపోత వర్షాల కారణంగా సతమతం అవుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :