కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మూడు నెలల నుండి డాక్టర్ రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వైద్యం కోసం వైద్యశాలకు వెళ్తే రోజుల తరబడి తాళం వేసి ఉంటుందని గ్రామ ప్రజలు తెలిపారు డాక్టర్ ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తే లేడు ఎవరికి కూడా తెలియదు కానీ పూర్తిస్థాయి వైద్యుడు ఉన్న వారానికి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాడని పై అధికారుల అండదండలతో హాజరు రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నట్లు బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ముందు గంటసేపు బిజెపి నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రజలకు వైద్యం అందించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జంగపల్లి ఎంపిటిసి అట్టికం రాజేశం గౌడ్, బిజెపి నాయకుడు జాలి శ్రీనివాస్ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు