కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఉన్నత పాఠశాలను శనివారం డిఇఓ జనార్దన్ రావు సందర్శించారు ఉపాధ్యాయ బృందం తో సమావేశం నిర్వహించి విద్యార్థుల హాజరు పిల్లల సమర్ధలు గ్రేడ్లు తదితర అంశాలపై సూచనలు చేశారు పాఠశాల పారిశుద్ధ్యం కోవిడ్ నేపథ్యంలో అనుసరిస్తున్న విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు తరగతి గదులను సందర్శించి తరగతిలో పిల్లలను పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు పిల్లల్లో కనీస సామర్ధ్యాలు లేఖ రచన తదితర అంశాలపై విద్యార్థుల ప్రతి స్పందనను ప్రశంసించారు విద్యార్థులతో నిమగ్నమై లక్ష్య సాధన కోసం శ్రమించవలసిన విధానాన్ని వివరించారు అనంతరం పాఠశాలలో పూల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి, ఉపాధ్యాయు బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు