కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు నగునూరి శంకర్ బీజేవైఎం మండల అధ్యక్షులు కూన మహేష్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఫలితాలు బిజెపి అద్భుతంగా 48 కార్పొరేట్ సీట్లు కైవసం చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు ప్రధాన మంత్రి మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చిత్రపటాలకు మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం గడ్డం నాగరాజు ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరిన చాకలివాని పల్లి గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈకార్యక్రమంలో జంగపల్లి ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి,కాంతల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండి తిరుపతి,మునిగంటి సత్తయ్య, బిజెపి మహిళ మోర్చా నాయకురాలు మచ్చ జ్యోతి, ఏబీవీపీ హరికాంతం అనిల్ రెడ్డి, చిగురు సంజీవ్, దొంతరవేని రవి, బిజెవైఎం నాయకులు కుర్ర హరీష్, మచ్చ మురళి మచ్చ స్వాముల,తీష్ ప్రశాంత్, వెంకటేష్,సిరిగిరి అంజి, సిరి భాస్కర్, వినయ్, నక్క పరశురాం, బోయిని ప్రశాంత్, బిజెపి సీనియర్ నాయకులు బిజెపి కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు