అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్న గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు ప్రతి శుక్రవారం వైద్య పరీక్షలు విచ్చేసిన గర్భవతులకు, మహిళలకు ఉచిత పోషక ఆహారం అందించి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి పట్టణ కన్వీనర్లు పాటిల్ సురేష్, ఎంకే చౌదరి, జక్కలచెరువు ప్రతాప్, చికెన్ శ్రీనివాసులు, కొత్తపేట నాగేపల్లి సూరి, ఎర్రగుడి రమేష డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ చెరకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.