అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు జనసేన జెండాను ఆవిష్కరించారు కేక్ కత్తిరించి ఒకరికొకరు వినిపించుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రశ్నించే గొంతుకు గా జనసేన పార్టీని స్థాపించి నేడు మహాశక్తిగా ఉండడానికి ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటినుండి పార్టీ అధ్యక్షుడు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకొని పార్టీ సేవలను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత శక్తివంతంగా తయారు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయ గడ్డ బ్రహ్మయ్య, నాగయ్య, డాక్యుమెంట్ రైటర్ సత్య, నాగయ్య, కమేళా వీధికి చెందిన నాయకులు హరి, కాజా,బాలరంగడు, శేక్షావలి తదితరులు పాల్గొన్నారు
