భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెజెర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వివిధ పథకాలను అందిస్తూ పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రంజాన్, క్రిస్టమస్ కానుకలు, రైతులకు పంట రుణాలు, మరణించిన రైతు కుటంబానికి ఐదు లక్షల భీమా చెక్కులు ఇలా మరెన్నో పథకాలను అందిస్తున్నామన్నారు. తహశీల్దార్ అనిల్ మాట్లాడుతూ మండలానికి 15782 చీరలు మంజూరైనట్లు,చౌకధర దుకాణాల ద్వారా చీరలు పంపిణీ కోసం కూపన్లు జారీ చేయటం జరుగుతుందని తెలిపారు.
రైతుల కష్టాలపై స్పందన:
చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన బాలసాని లక్ష్మీనారాయణకి కొంతమంది రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక రైతు వల్ల పడుతున్న ఇబ్బందులను, మిగిలిన రైతుల కష్టాలను ఎమ్మెల్సీ కి వివరించిన కొత్తపల్లి జెడ్ రైతుబంధు సమితి కో. ఆర్డినటర్ ముమ్మనేని అరవింద్. వివరాలలోకి వెళితే చర్ల మండలంలోని ఒక రైతు 25 ఎకరాలు పొలాన్ని కొనుగోలు చేసి, ఆ పొలానికి ఆనుకుని ఉన్న చెరువును, కుంటలను అక్రమించి, రైతులు నడిచే గట్టు, దారి కూడా మూసివేసి రైతులను ఇబ్బందులకు గురిచేయాడమే కాకుండా తనపొలం మధ్యనుండి కాలువ నిర్మించి వర్షపు నీరు లోతట్టు పొలాలకు వదులుతూ రైతులను నష్టపరుస్తున్నాడు. ఈ విషయమై రైతులకు న్యాయం చేయాలని పిర్యాదు చేయగా, ఎమ్మెల్సీ బాలసాని స్పందించి తక్షణమే మండల తహాసీల్దారును ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండ చూడాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని, రైతులకు న్యాయం చేయటానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మేజర్ పంచాయితీ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు శివ, పంచాయితీ సిబ్బంది, తెరాస మండల అధ్యక్షులు సోయం రాజారావు, కార్యదర్శి బండి వేణు, అధికార ప్రతినిది సయ్యద్ అజీజ్, కాపుల నాగరాజు, పంజా రాజు, యూత్ నాయకులు కాకి అనిల్, పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు కాకి నర్సింహారావు పాల్గొన్నారు.