కరీంనగర్ జిల్లా : ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 4వ విడతలో భాగంగా 9వ రోజున కూడా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిగురుమామిడి గ్రామ శివారులో పాంబండ పంచముఖ ఆంజనేయస్వామి గుడి వద్ద బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా నేడు 300 మొక్కలను నాటడం జరిగినది.ఈ యొక్క పల్లె ప్రగతి కార్యక్రమంలో వాడ వాడన ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకవస్తే వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని వారు తెలిపారు.చిగురుమామిడి గ్రామంలో అపరిశుభ్రంగా ఉండి, కూలిపోయే స్థితిలో ఉన్న పాత గోడలను పరిశీలిస్తూ వాటి వలన జరిగే ప్రమాదాలను హెచ్చరిస్తూ వాటిని ఆ యొక్క ఇంటి యజమానులు కూల్చివేసుకోవాలని లేని యెడల ఇంటి యజమానులు కూల్చి వేసుకునే విధంగా గ్రామ పంచాయతీ అవగాహన కల్పించాలని తెలిపారు..పల్లె ప్రగతి 9వ రోజులో భాగంగా చిగురుమామిడి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో రంగేలి ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నథానియల్,ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్,ఎపివో రాధ, ఉప సర్పంచ్ ముక్కెర పద్మ,గ్రామ ప్రత్యేక అధికారి రాకేష్,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, ఎఎన్ఎం, మహిళా సంఘ సీఏ లు,అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.