కరీంనగర్ జిల్లా: భారతదేశంలో ప్రముఖ సంఘసంస్కర్తలలో ఒకరైన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిభాయిపూలే 123వ వర్ధంతి వేడుకలను చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు.బిసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్, స్థానిక ఎంపీపీ కొత్త వినీత సావిత్రి భాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బిసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే భార్యగా విద్యాబోధనకు, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి చేశారని అన్నారు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్య వంతులను చేయడమే గాకుండా అనాథస్త్రీలకు పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించిందని అన్నారు. మహిళా విభాగం ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించిందని, ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించి సావిత్రిభాయిపూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుందని అన్నారు
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎంపీపీ కొత్త వినీత మాట్లాడుతూ తన ఇంట్లో బాలికల పాఠశాలను ప్రారంభించి చదువుచెప్పడం అభినందనీయం అన్నారు. అప్పట్లో బాలికలకు చదువు చెప్పడం ఇష్టం లేని కొందరు సావిత్రిభాయిపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నా, నా విధిని నేను నిర్వహిస్తానని తెగేసి చెప్పిన ధీరవనిత అని ఎంపీపీ కొత్త వినీత సావిత్రిభాయి సేవలను కొనియాడారు ఈ వర్ధంతి వేడుకల కార్యక్రమంలో బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్, ఎంపీటీసీ సభ్యులు మెడబోయిన తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్లు ముద్రకోళ రాజయ్య, తాళ్ళపెళ్ళి తిరుపతి, బియస్పీ మండల అధ్యక్షుడు బోయిని బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాంబారి కొమురయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహమ్మద్ సర్వర్ పాష, గౌడయువజన జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, ఎస్సీ,ఎస్టీ,బిసీ,మహాసేన జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి రాంబాబు, బహుజన నాయకులు పత్తెం వీరస్వామి, గడ్డం అనిల్, తూర్పాటి కరుణాకర్,చిట్టెల స్వామి, తదితరులు పాల్గొన్నారు