కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామ శివార్లలో మానేరు వాగు లో పెద్ద కొండచిలువ చిక్కింది వివరాల్లోకి వెళితే గన్నేరువరం గ్రామానికి చెందిన కుంభం నాగరాజు తోటి మత్స్య కార్మికులు కలిసి శనివారం చేపలవేట కోసం వెళ్లి వల వేశారు ఆదివారం తెల్లవారుజామున చేపలవేట కోసం వెళ్ళిన మత్స్య కార్మికులు అతి బరువు ఉండడంతో చేప అనుకొని బయటకు తీసిన క్రమంలో అది కొండచిలువ కావడంతో మత్స్య కార్మికులు భయాందోళనకు గురయ్యారు మత్స్య కార్మికులు మాట్లాడుతూ గత నెల లో కొండచిలువ చనిపోయే చిక్కిందని ఇప్పుడు మరొకటి వెలుగులోకి రావడంతో భయాందోళనకు చెందుతుందని అన్నారు వలకు చిక్కిన కొండచిలువ ను మానేరు వాగు నుంచి బయటకు తీశారు