అలీఘడ్ ఉత్తరప్రదేశ్ నుంచీ చైనా మీద యుద్ధం చేయడానికి బయల్దేరిన 10 మంది చిచ్చరపిడుగులు.. చైనా మన సైనికులను క్రూరంగా చంపిందని తెలియగానే ఆవేశంతో ఊగిపోయి ఉన్నపళంగా గజేంద్ర మోక్ష సమయంలో మహవిష్ణువు కరిని రక్షించడానికి ఆదరాబాదరాగా వెళ్ళినట్టు ఈ చిన్నారులు కొంతమంది చొక్కా కూడా వేసుకోకుండా సరిహద్దులకు యుద్ధానికి బయల్దేరిన చిన్నారి చత్రపతి శివాజీలు..గుంపుగా నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ పిల్ల సైన్యాన్ని చూసి పోలీసులకు అనుమానం వచ్చి దారిలో ఆపి విషయం కనుక్కొని పోలీసులు ఆనందం ఆశ్చర్యాలకు గురయ్యారు..బృందానికి నాయకత్వం వహించిన కరణ్ కు నచ్చచెప్పి ఇళ్ళకు పంపివేశారు..అరే బుడ్డోళ్ళారా మీరేరా దేశానికి భవిష్యత్తు .. భరతమాత పాదాల చెంత కాంతులీనే వజ్రపుతునకలు..ఆణిముత్యాలు..
మీలాంటి జనరేషన్ కోసమైనా మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూనే ఉంటాం..మీరే మాకు ఆక్సిజన్..మీరే మాకు స్పూర్తి మీరే మా ఆశ..
భారత్ మాతాకీ జై..