గతంలో ఒక వెలుగు వెలిగిన టాటా సఫారీ కారు మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 2021 మోడల్ టాటా సఫారీ లాంచ్ అయింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 14.69 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) కాగా… హై ఎండ్ ధర రూ. 21.45 లక్షలు. సఫారీ కార్లను మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు గత నెలలో టాటా కంపెనీ ప్రకటించింది. రిపబ్లిక్ డే రోజున ఈ కారు మోడల్ ను విడుదల చేసింది. ఇప్పటికే సఫారీ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. రూ. 30 వేలు కట్టి ఏ డీలర్ వద్ద అయినా కారును బుక్ చేసుకోవచ్చు. సఫారీ XE, XM, XT మరియు XZ వేరియంట్లలో లభిస్తుంది. ఆరు సీట్లు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ తో కారును బుక్ చేసుకోవచ్చు. ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ అన్ని వేరియంట్లలో ఉంటుంది. ఆరు సీట్ల కాన్ఫిగరేషన్ మాత్రం XZ+ మరియు XZA+ వేరియంట్లలోనే అందుబాటులో ఉంటుంది.
టాటా సఫార్ వివిధ వేరియంట్ల ధరల వివరాలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్):
వేరియంట్లు | ధర (లక్షల్లో) |
XE | 14.69 |
XM | 16.00 |
XM AT | 17.45 |
XT | 17.45 |
XT+ | 18.25 |
XZ | 19.15 |
XZ AT | 20.40 |
XZ+ | 19.99 |
XZ+ AT | 21.25 |
XZ+ అడ్వెంచర్ పర్సొనా | 20.20 |
XZ+ AT అడ్వెంచర్ పర్సొనా | 21.45 |