- డాక్టర్స్ సెల్ టిపిసిసి వైస్ చైర్మన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా… చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం దేవులవాడ లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్స్ సెల్ టిపిసిసి వైస్ చైర్మన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు కు పిండ ప్రదానం చేశారు, ఈ సందర్భంగా డాక్టర్ దాసరపు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం లో ప్రజల కష్టాలు తీర్చలేని బి ఆర్ ఎస్ నాయకులు చచ్చినవారితో సమానమని,కే సి ఆర్, కే టి ఆర్,బాల్క సుమన్ పేరిట పిండ ప్రదానం చేస్తూన్నా మని తెలిపారు. గత నాలుగేళ్లుగా వరదలతో, రైతు లు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం కమిషన్ల కోసమే డ్యాములు కట్టి నిండా రైతులని ముంచి కనీస న్యాయం చేయలేని చేతగాని ప్రభుత్వం అని, రైతు లకు ఉచిత కరెంటు అని చెప్పి లాగ్ బుక్కులను దాచి కొత్త బుక్కులు పెట్టిన దొంగ ప్రభుత్వం బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని,నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట దగా చేస్తూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని దౌర్జన్యం ప్రభుత్వం అని, ఇక చెన్నూర్ లో బాల్క సుమన్ ఆగడాలు కుప్పలు తెప్పలుగా నిర్వహిస్తూ, ఒక దలితుడు అయి ఉండి, పట్టాలు ఉండి రైతు బందు పడే దలితుల భూమిని దౌర్జన్యంగా లాగుకొని ఆర్ టి సి డిపో కు కేటాయించటం దౌర్బాగ్యం అని, ఇక బి ఆర్ ఎస్ పార్టీ పాతాళానికి పోయే లా ప్రజలు గట్టి తీర్పు తప్పకుండా ఇస్తారని, బి ఆర్ ఎస్ పార్టీ భూస్తాపితానికి పునాదిగా పిండ ప్రధానం చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యద్దిక సీట్లతో భారీ మెజారిటీతో గెలిచి గద్దెనెక్కడం కాయం అని, చెన్నూర్ నియోజక వర్గం లో బాల్క సుమన్ కు బుద్ది వచ్చేలా ఓడించి చెన్నూర్ గడ్డ పై కాంగ్రెస్ పార్టి జెండా ఎగురవేస్తాం అనితెలిపారు.