టీఎస్‌ఆర్టీసీకి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఇంధన పొదుపులో ద్వితీయస్థానంలో నిలిచి పురస్కారాన్ని దక్కించుకున్నది. ఇంధన పొదుపు సూత్రాన్ని పక్కాగా అమలుచేస్తూ.. కేఎంపీఎల్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్న దానికి ఫలితం దక్కింది .
రాష్ట్రస్థాయి ఇంధన పొదుపు విభాగంలో దిల్‌సుఖ్‌నగర్, హెచ్‌సీయూ, ముషీరాబాద్-2 డిపోలకు రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఆయా డిపో మేనేజర్లు కృపాకర్‌రెడ్డి, దైవాదీనం, రవీందర్‌రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని పెట్రోలియం ఉత్పత్తులను, ఇతర ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవటం ఎంతైనా అవసరమన్నారు. సునీల్‌శర్మ మాట్లాడుతూ.. ఆర్టీసీ గతంలో ఉత్పాదకత, రహదారి భద్రత, ఇంధన పరిరక్షణ క్యాటగిరీల్లో పలు అవార్డులు సాధించిందని, తాజాగా వచ్చిన పురస్కారం మరో మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, టీవీ రావు, యాదగిరి, వెంకటేశ్వర్లు, సీఎంఈ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం (పీసీఆర్‌ఏ), అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ)తో కలిసి నిర్వహించిన ‘సాక్ష్యం-2020’లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇంధన పొదుపు పురస్కారాలను ప్రదానంచేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ తరఫున సంస్థ ఎండీ సునీల్‌శర్మ రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను స్వీకరించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference