హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త చైర్మన్‌ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావు నియమితులయ్యారు
1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మహేందర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మహేందర్ రెడ్డి. 2022, డిసెంబర్ 31వ తేదీన మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు.