హైదరాబాద్ : తెలంగాణ మూవీ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ( డాట్ ) పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే డబ్బింగ్ అసోసియేషన్ లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ కార్మిక శాఖ కళాకారుల సమస్యలను గుర్తించి రాష్ట్ర స్థాయి డబ్బింగ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ట్రేడ్ యూనియన్ లైసెన్స్ చెల్లదని, తెలంగాణ యూనియన్ పనికిరాదని , అవి ఎక్కువకాలం నిలవవని, డాట్ అనే అసోసియేషన్ మాత్రమే గొప్పదని కళాకారులను మోసం చేస్తూ వేలకు వేలు వసూళ్లకు పలుపడుతున్న విషయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాక డాట్ సభ్యులు మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న విషయాన్ని , సౌండ్ ఇంజినీర్ల పై బెదిరింపులకు పాలుపడే విషయాన్ని , కొత్తగా వచ్చే కళాకారులను వర్కులు చేసుకోకుండా డాట్ లో గుర్తింపు కార్డు ఉంటేనే డబ్బింగ్ చెప్పాలని అనేక సమస్యలు వెలిగులోకి వచ్చాయి.. బాధితులు తెలంగాణ మూవీ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షరాలు కవితా ఝాన్సీ గారికి విన్నవించుకోవడం జరిగింది.
సదరు సమమస్యల పై స్పందించిన కవిత ఝాన్సీ కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్లి, అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
అధ్యక్షురాలు కవితా ఝాన్సీ మాట్లాడుతూ యువ డబ్బింగ్ కళాకారులు మోసపోవద్దని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మూవీ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఉచితంగా అంటే కేవలం 150 రూపాయలకు గుర్తింపు కార్డు ఇస్తుంది కావున ప్రతిభ ఉన్న కళాకారులు సప్రదించవలసిందిగా కోరారు.