డిజిటల్ ఇండియా లక్క్ష్యంగా చేసుకునే కేంద్రం బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు మరింత ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ భారత్‌లో భాగంగా మొదలైన కాంటాక్ట్ లెస్ చెల్లింపుల వ్యవహారం.. కరోనా టైంలో ‘నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి’ కారణంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ 61 బిలియన్ డాలర్లు ఉండగా 2021 నాటికి అది ఏకంగా 300 బిలియన్ డాలర్లకి చేరుకుంది