సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన,తోంటి చంద్రశేఖర్, వయసు 37 సంవత్సరాలు గల యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు వివరాల్లోకి వెళ్తే 6,తేదీ చెల్లె మామయ్య దినకర్మకు, ఇరువురి సొంత ఊరైన తంగళ్ళపల్లి గ్రామానికి చంద్రశేఖర్, 6 వ, తేదీ కుటుంబ సభ్యులతో సహా సాయంత్రం గ్రామానికి వచ్చాడు అదే రోజునుండి స్వల్పంగా జ్వరం రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించాడు, ఎంతకు తగ్గక పోయేసరికి, కోహెడ, నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నిర్వహించగా టైఫాయిడ్, జ్వరంగా నిర్ధారించి మందులు ఇచ్చారు, మందులు వాడుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, హైదరాబాద్,13, తేదీ రోజున వెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా 16,వ తేదీ రోజున వైద్యులు నిర్ధారించారు విషయం తెలుసుకున్న తల్లి, తోంటి చెన్నావ్వ హైదరాబాద్ కు వెళ్లి తీవ్ర జ్వరంతో బాధ పడడంతో ఆస్పత్రికి తరలించారు తండ్రి తోంటీ కనకయ్య రెండు రోజుల నుండి దగ్గు, జ్వరం, జలుబుతో, బాధపడుతున్నాడు, చంద్రశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందనన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మండల వైద్య అధికారులకు, అధికారులకు చరవాణి ద్వారా సమాచారాన్ని అందించగా, గ్రామానికి సిబ్బందితో వచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించారు, కరోనా లక్షణాలు కనిపించడంతో, కనకయ్యను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి ప్రత్యేక పి,పి, కిట్, వేసి,108 వాహనం ద్వారా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, పరీక్షలు నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉందిచంద్రశేఖర్ గ్రామంలో,6 రోజుల నుండి,40, మంది బంధువులతో పాటు, స్నేహితులతో కలిసి తిరిగినట్లు తెలిసింది వైద్యులు పోలీసు అధికారులు,ప్రజా ప్రతినిధులు, వారి వారి పూర్తి వివరాలు తెలుసుకొని, స్వయం నిర్బంధంలో ఉండాలని,వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు