కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: పండుగ ఎల్లవ్వ భర్త కొమురయ్య వయసు 65 సంవత్సరాలు గురువారం రాత్రి కరీంనగర్ బస్టాండ్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పుత్తూరు వయా మీదిగా గన్నేరువరం వెళ్లే బస్సులో పండుగ ఎల్లవ్వ అనే వృద్ధురాలు ప్రయాణం చేసింది వివరాల్లోకి వెళితే పండుగ ఎల్లవ్వ ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి వెళ్లడానికి వెళ్లగా దిగవలసిన చోట దిగకపోవడంతో ఆమె గన్నేరువరం బస్టాప్ లో దిగి ఉంది ఎల్లవ్వ రాత్రి 10 గంటల సమయంలో ఓ ఇంట్లో ఉంది ఆ ఇంటి యజమాని ఆమె ఊరు పేరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగా ఆమె చెప్పకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎల్లవ్వ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ఆమెను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందినట్టు పోలీసులు గుర్తించారు వల్లంపట్ల గ్రామ ఎంపిటిసి తో ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అక్కడ ఎంపిటిసి సమక్షములో గన్నేరువరం పోలీసులు వల్లంపట్ల ఆమె స్వగృహానికి వెళ్లి తప్పిపోయిన ఎల్లవ్వ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి ని మరియు వెంటనే స్పందించినందుకు కానిస్టేబుల్ సంపత్ నీ వల్లంపట్ల గ్రామస్తులు కుటుంబ సభ్యులు
అభినందించారు