తిరుమలలో గరుడ సేవ జరుగుతున్న రోజున, తిరుపతిలో గరుడపక్షి కనిపించడంతో ప్రజలు స్వామివారి మహిమేనని భావించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ అరుదైన పక్షి, ఎగరలేక పడిపోయి ఉండటాన్ని పరిశీలించిన స్థానికులు సమాచారాన్ని అటవీ సిబ్బందికి చేరవేశారు. అటవీ అధికారులు వచ్చి, దీన్ని ఎస్వీ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ఈ పక్షికి వైద్యం అందిస్తామని, కోలుకున్న తరువాత, శేషాచలం అడవుల్లో వదిలేస్తామని తెలిపారు. కాగా, తిరుమలలో గరుడసేవ రోజున గరుడపక్షి తప్పనిసరిగా కనిపిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉన్న సంగతి తెలిసిందే.