నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ అర్బన్ శివాజీ నగర్ లో తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికాలంగా యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్నా అవినీతి అక్రమ వ్యవహారాలపై ఎట్టకేలకి ఈసీ కొరడా రగిలిస్తుంది కానీ ఈసీ చైర్మన్ మాత్రం రవీందర్ గుప్తా ఉన్నారు తన చేసిన అక్రమాలు బయటకు రాకుండా తప్పకుండా జాగ్రత్త పడతారని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలియజేస్తున్నాను విసి అవినీతి అక్రమంగా ప్రమోషన్ పేరిట & నియామకాలు పేరిట లక్షలాది డబ్బులు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ విషయాన్ని బయట పెట్టడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు కేవలం ఏసీబీ బరిలో దిగితే తప్ప వీసి అక్రమాలకు ముగింపు అనేది ఉండదు విసి రవీందర్ గుప్తా ఇన్ని రోజులు ఇష్ట రాజ్యాంగ యూనివర్సిటీకి వస్తున్న నిధులు అదేవిధంగా యూనివర్సిటీ కి అనుసంధానమైన కళాశాలలో నుంచి వస్తున్న నిధులను డబ్బులను లెక్క చూపించకుండా బకాసురుల్లాగా మింగేసాడు ఇప్పుడు అయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు ఏదైతే ఈసీ సభ్యులను ఎంచుకున్నారు వారిపై తెలంగాణ విద్యార్థి పరిషత్ గా మాకు ఎటువంటి నమ్మకం లేదు కావున ఏసీబీ ని బరిలోకి దింపి విసి చేసిన అక్రమాలను బయటపెట్టి జైలుకు పంపించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికిప్పుడు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నించి ధర్నా చేస్తే తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టిన మాత్రాన ఉద్యమాల ఆదోని రేపటి నుంచి ఉద్యమాన్ని ఇంకా చేస్తామని విసి రవీందర్ గుప్తాని జైలుకి పంపించే వరకు ఊరుకోమని హెచ్చెరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్ సంక్షేమ హాస్టల్లో ఇంచార్జ్ ఎర్ర ప్రవీణ్ కార్యకర్తలు దేవేందర్ వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
