ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో దళిత రత్న అవార్డు లు ప్రధానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న దళిత రత్న అవార్డు ను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా బెల్లంపల్లి కు చెందిన కుంభాల రాజేష్ అందచేశారు. దళిత రత్న అవార్డు అందుకున్న కుంభాల రాజేష్ మాట్లాడుతూ ఈ అవార్డు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవార్డు రావడానికి కృషి చేసిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బుర్ల వెంకటేశ్వరరావు మాల మహానాడు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధమ్మ రాజశేఖర్ . మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు,
నాయకులు నర్సింగ్ రావ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు