తెలంగాణ దేశంలోనే వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ,మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలతో రైతులు భూములను అమ్ముకోవడం ఆగిపోయి, భూమిని నమ్ముకోవడం మొదలైందని తెలిపారు. సోమవారం హాకాభవన్‌లో 2019లో వ్యవసాయ ప్రగతి, వచ్చేఏడాది శాఖపరంగా చేపట్టే అంశాలను మీడియాకు వివరించారు. అనంతరం విత్తనాభివృద్ధి సంస్థ 2020 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూలీల కొరత వేధిస్తున్నదని, ఉపాధిహామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ యాక్టివిటీ, క్రాప్‌కాలనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్, రైతుసమన్వయసమితి వంటి కార్యక్రమాల బలోపేతానికి వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధంచేస్తామని మంత్రి తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )