ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పారా మిలిటరీ లో దేశం కోసం సేవలందిస్తున్న జవానులు ఎన్నో సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయం . దేశ సేవే కాదు ప్రజా సేవలోను ముందున్నారు .వివరాలలో వెళితే శ్రీకాకుళం జిల్లాలో పారా మిలిటరీ జవానులు అనగా CRPF , BSF , ITBP , SSB జవానులు సుమారు రెండువేల మంది కలిసి శ్రీకాకుళం పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ గత సంత్సరం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది . అనాధ బాల బాలికలు , అనాధ వృద్దులకు , నిత్యావసర సరుకులు , బట్టలు , బియ్యం పంపిణి చేయడం , అలాగే కోవిడ్ టైం లో పోలీస్ వారికి మాస్క్ లు , శానిటైజర్ లు అలాగే పేద ప్రజలు నిత్యావసర సరుకులు సరఫరా చేసి ఆదుకున్నారు . అంతే కాక గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల పై అవగాహన కల్పించి వారికి సహకరిస్తున్నారు . అనేక సేవా కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు సాగిన పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 20 – 2021 న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి కృపావరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం జవాన్లు చేస్తున్న పోరాటాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా మాజీ అధ్యక్షురాలు ధర్మాన పద్మప్రియ, అసోసియేషన్ లీగల్ అడ్వొయిజర్ వంశీకృష్ణ , యాళ్ల అప్పలనాయుడు , బి.మాధవరావు , కె.లక్ష్మణరావు , ఆట్ల సుమన్ , గంగిట్ల శ్రీనివాసరావు , కె.సుమన్ , డోలా నాగరాజు , వల్లభ రావు, మడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు .