దేశ సేవే కాదు సామజిక సేవలో కూడా ముందున్నామని ఆదిలాబాద్ సి ఏ పి యఫ్ జవానులు నిరూపించుకున్నారు . మంచిరియల్ జిల్లా బాబురావు పేట గ్రామానికి చెందిన మహిళా ఊపిరితిత్తుల వ్యాధితో ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది . చికిత్సకు డబ్బులేక ఇబ్బందిపడుతూ ఉండగా .. స్థానిక పేపర్ లో దాతల సాయం కోసం ఎదురు చూపులు అనే కధనాన్ని చూసి స్పందించిన జవానులు సుమారు యాభైవేల రూపాయల వరకు చందాలు వేసుకొని సి ఏ పి యఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితురాలికి అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నారాయణ , నాగరాజు , మారుతి , కిరణ్ కుమార్ , ప్రభాకర్ పాల్గొన్నారు .